logo
Published : 29 Jun 2022 04:27 IST

స్తంభమే కాపాడింది

కాలువ అంచుల్లోకి దూసుకెళ్లిన బస్సు

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం


పాలకోడేరు శివారులో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు

పాలకోడేరు, న్యూస్‌టుడే:  పాలకోడేరు శివారులో మంగళవారం రాత్రి ఆర్టీసీ బస్సు అదుపు తప్పి.. త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, ప్రయాణికుల కథనం ప్రకారం.. భీమవరం నుంచి తణుకు బయల్దేరిన బస్సు పాలకోడేరు శివారు వద్ద ఎదురుగా వచ్చిన లారీని తప్పించే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న గోస్తనీ కాలువ అంచుల్లో కి దూసుకెళ్లి..వినియోగంలో లేని విద్యుత్తు స్తంభాన్ని ఆనుకుని ఆగింది. అక్కడ స్తంభం లేకుంటే కాలువలోకి బోల్తాపడి పెనుప్రమాదం జరిగేదని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉండగా కోరుకొల్లు గ్రామానికి చెందిన నలుగురు యువతులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులతో పాటు ఆ మార్గంలో ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారు ఆగి బస్సులో ఉన్నవారిని బయటకు చేర్చారు. ఆందోళనతో స్పృహతప్పిన ఇద్దరు మహిళలకు సపర్యలు చేశారు. కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అత్యవసర వాహనంలో భీమవరం ప్రభుత్వాసుపత్రికి పంపించారు.

అత్యవసర వాహనంలో క్షతగాత్రుల తరలింపు

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts