logo

ఆదర్శనీయుల పురిటిగడ్డ మోగల్లు

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, ప్రముఖ శాస్త్రవేత్త ఏఎస్‌రావుల వంటి దేశానికే ఆదర్శవంతమైన వ్యక్తులను అందించిన గడ్డ మోగల్లు అని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో

Published : 29 Jun 2022 04:27 IST

మోగల్లులో బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న బీవీ రాఘవులు

మోగల్లు (పాలకోడేరు), భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, ప్రముఖ శాస్త్రవేత్త ఏఎస్‌రావుల వంటి దేశానికే ఆదర్శవంతమైన వ్యక్తులను అందించిన గడ్డ మోగల్లు అని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మోగల్లులో మంగళవారం ఆయన పర్యటించారు. అల్లూరి సీతారామరాజు, ఏఎస్‌రావుల విగ్రహాలకు  పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం అల్లూరి స్వగృహ ప్రాంతంలో నిర్మిస్తున్న అల్లూరి జ్ఞానమందిర ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం భీమవరానికి బైక్‌ ర్యాలీను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మంతెన సీతారాం, సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం, ప్రత్యేక హోదా సాధన కమిటీ రాష్ట్ర నాయకులు జీవీ సత్యనారాయణ, నాయకులు కోనాల భీమారావు, రంగారావు, గోపిమూర్తి, క్రాంతిబాబు, రంగారావు, విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి అందరివాడు.. అల్లూరి జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో భీమవరంలో మంగళవారం జరిగిన సభలో రాఘవులు మాట్లాడారు. అల్లూరి ఏ ఒక్కరికీ పరిమితం కాదని, అందరివాడన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఎమ్మెల్సీ షేక్‌సాబ్జీ, బలరాం, సీతారాం, కనుమూరి సత్యనారాయణరాజు, సీహెచ్‌ రంగారావు, గంటా సుందరకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని