logo

అమ్మకు అందని పోషణ..!

సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న శిశువులకు జన్మనిచ్చి బలమైన భావి భారతాన్ని నిర్మించాల్సిన అమ్మలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు గర్భిణులకు, బాలింతలకు అందించాల్సిన సంపూర్ణ పోషణ సరిగా అందకనో, పౌష్టికాహారంపై వారు దృష్టి పెట్టకనో జిల్లా వ్యాప్తంగా

Published : 29 Jun 2022 04:27 IST

రక్తహీనతతో తల్లడిల్లుతున్న తల్లులు

పాలకొల్లు, న్యూస్‌టుడే

సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న శిశువులకు జన్మనిచ్చి బలమైన భావి భారతాన్ని నిర్మించాల్సిన అమ్మలు రక్తహీనతతో బాధపడుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు గర్భిణులకు, బాలింతలకు అందించాల్సిన సంపూర్ణ పోషణ సరిగా అందకనో, పౌష్టికాహారంపై వారు దృష్టి పెట్టకనో జిల్లా వ్యాప్తంగా 67 శాతం పైబడి అమ్మలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇది ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోంది. వివిధ ఆరోగ్య సర్వేల ద్వారా దీనిని గుర్తించిన అధికారులు జులై 1నుంచి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారానే గర్భిణులకు, బాలింతలకు సంపూర్ణ పోషణను మళ్లీ అందించాలని నిర్ణయించారు.

పర్యవేక్షణతోనే గట్టెక్కేది

గ్రామీణ ప్రాంతాల్లోనూ పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాల్లో ఇంటిల్లిపాది భోజనం చేసిన తర్వాతనే మహిళలు చేయడం ఆనవాయితీ. దీనిలో గర్భిణులు, బాలింతలు కూడా ఉండటం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది. అంగన్‌వాడీల్లో సంపూర్ణ పోషణ అందిస్తున్నా ఇళ్లలోనే తినడానికి అలవాటు పడిన గర్భిణులు, బాలింతలు అంతగా ఆసక్తి చూపకపోవడం మరో కారణంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా పౌష్టికాహారం తీసుకునేలా అంగన్‌వాడీ సిబ్బంది అవగాహన కల్పించడం, ప్రతి బుధవారం వైద్యఆరోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు చేయడం ద్వారా సమస్య నుంచి గట్టెక్కిస్తుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కూడా పెరగాల్సి ఉంది. ఈ పరిస్థితిపై ఐసీడీఎస్‌ పీడీ బి.సుజాతరాణిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా సంపూర్ణ పోషణ అంగన్‌వాడీల ద్వారా వచ్చేనెల 1 నుంచి అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ఇదిగో లెక్క

వాస్తవానికి గర్భిణులకు బాలింతలకు రక్తంలో హిమోగ్లోబిన్‌ 11 శాతానికి పైబడి ఉండాలి. జిల్లాలో అమ్మలు కాబోయేవారు, ఇప్పటికే ఐనవారికి కేవలం 32.29 శాతం మందికి మాత్రమే ఇలా ఉంది. 11 నుంచి 9శాతం మాత్రమే ఉన్నవారు అత్యధికంగా 63.31శాతం ఉండటం ఆందోళన కలిగించే అంశం. 9 నుంచి 7 శాతం మాత్రమే ఉన్నవారు 4.40 శాతం మంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని