logo

వర్జీనియా పొగాకు ధర పైపైకి!

మేలు రకం వర్జీనియా పొగాకు ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. జంగారెడ్డిగూడెం ఒకటో వేలం కేంద్రంలో మంగళవారం కేజీకి రూ.203 గరిష్ఠ ధర లభించింది. నాలుగు రోజులుగా వేలం ఆశాజనకంగా సాగుతోంది. ప్రారంభం నుంచి రూ.195 గరిష్ఠ ధరకు

Published : 29 Jun 2022 04:27 IST

గరిష్ఠంగా రూ.203 నమోదు

ఒకటో వేలం కేంద్రంలో పొగాకు వేలం

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: మేలు రకం వర్జీనియా పొగాకు ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. జంగారెడ్డిగూడెం ఒకటో వేలం కేంద్రంలో మంగళవారం కేజీకి రూ.203 గరిష్ఠ ధర లభించింది. నాలుగు రోజులుగా వేలం ఆశాజనకంగా సాగుతోంది. ప్రారంభం నుంచి రూ.195 గరిష్ఠ ధరకు కొనుగోలు చేసిన కంపెనీలు కేజీకి సుమారు రూ.8 వరకు పెంచాయి. ఇది నిల్వ చేసిన రైతులకు మేలు చేసే పరిణామం. జంగారెడ్డిగూడెం ఒకటో వేలం కేంద్రంలో సోమవారం రూ.200 ఉన్న ధర.. మంగళవారం మరో రూ.3 పెరిగింది. రెండో వేలం కేంద్రంలో రూ.202గా నమోదైంది.

నాసిరకానికి కోత.. మేలు రకం పొగాకుకు   గరిష్ఠ ధర రూ.8 వరకు పెంచిన కంపెనీలు నాసిరకానికి కేజీకి రూ.10 వరకు కోత పెట్టాయి. జంగారెడ్డిగూడెం రెండు వేలం కేంద్రాల్లో కనిష్ఠ ధర రూ.140 నుంచి రూ.130కు పడిపోయింది. కొనుగోలు కూడా తగ్గించారు. ఈ కారణంగా చాలా బేళ్లు నోబిడ్‌ అవుతున్నాయి. జంగారెడ్డిగూడెం ఒకటో కేంద్రంలో సోమవారం 82, మంగళవారం 151, రెండో వేలం కేంద్రంలో సోమవారం 104, మంగళవారం 79 బేళ్లు నో బిడ్‌ అయ్యాయి. దీంతో సరకును రైతులు వేలం కేంద్రాల నుంచి వెనక్కి తీసుకుపోతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్న దృష్ట్యా నాసి రకం పొగాకుకు కూడా మంచి ధర ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని