logo

ఎన్నాళ్ల్లో వేచిన ఉదయం

జిల్లాలో తొలి విడతలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది. తాడేపల్లిగూడెంలోని సముదాయాల్లో ఇళ్ల అప్పగింతను గురువారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పురపాలక కమిషనర్‌ బాలస్వామి చెప్పారు

Published : 30 Jun 2022 04:53 IST

తాడేపల్లిగూడెం టిడ్కో ప్రాంగణంలో నేడు ఇళ్ల అప్పగింత

భీమవరం పట్టణం, తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో తొలి విడతలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది. తాడేపల్లిగూడెంలోని సముదాయాల్లో ఇళ్ల అప్పగింతను గురువారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పురపాలక కమిషనర్‌ బాలస్వామి చెప్పారు. జిల్లాలో భీమవరం, పాలకొల్లు పట్టణాల్లోనూ త్వరలోనే గృహప్రవేశాలు ఉంటాయని టిడ్కో ఈఈ స్వామినాయుడు స్పష్టం చేశారు. తొలివిడతలో తాడేపల్లిగూడెంలో 2,272, భీమవరంలో 1,920, పాలకొల్లులో 1,856 ఫ్లాట్లను కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.

రిజిస్ట్రేషన్లు పూర్తయిన వారికే..

తాడేల్లిగూడేనికి తొలివిడతలో 5376 టిడ్కో ఇళ్లు మంజూరయ్యాయి. సుమారు 58 ఎకరాల విస్తీర్ణంలో గృహ నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయి. తరువాత ప్రభుత్వం మారడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీనిపై లబ్ధిదారులు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత వచ్చింది. పట్టణానికి మంజూరైన 5376 గృహాల్లో 2272 మాత్రమే ప్రస్తుతం పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన వాటిని నవంబరు నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయిన వారికి మాత్రమే టిడ్కో ఇళ్లు దక్కనున్నాయి. తాడేపల్లిగూడెంలో 1800 మంది లబ్ధిదారులకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. మిగిలిన 472 మందికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించి రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయించేలా పురపాలక అధికారులు చర్యలు చేపట్టారు. ఎంచుకున్న ఇళ్లకు సంబంధించి మొత్తం సొమ్మును డీడీ రూపంలో చెల్లిస్తే వారికి కూడా ఇళ్లను ఇచ్చే అవకాశం కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని