logo

కేంద్రం కోటా ఇక లేనట్టేనా!

వరుసగా మూడో నెలలోనూ ఉచిత బియ్యం అందే పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఆగిపోయిన బియ్యం పంపిణీ ఎప్పుడు పునఃప్రారంభమవుతుందనే విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వడం లేదని కార్డుదారులు డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లను ప్రశ్నిస్తున్నారు.

Published : 30 Jun 2022 04:53 IST

మూడు నెలలుగా అందని బియ్యం

నరసాపురం, పాలకొల్లు, న్యూస్‌టుడే: వరుసగా మూడో నెలలోనూ ఉచిత బియ్యం అందే పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ఆగిపోయిన బియ్యం పంపిణీ ఎప్పుడు పునఃప్రారంభమవుతుందనే విషయం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఇవ్వడం లేదని కార్డుదారులు డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లను ప్రశ్నిస్తున్నారు. సాధారణ రేషన్‌ బియ్యం పంపిణీ గడువు ముగిసి పది రోజులు గడుస్తున్నా ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేవై) నిల్వలు గిడ్డంగులకు చేరలేదు.

కొవిడ్‌ నేపథ్యంలో అల్పాదాయ కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎంజీకేవై పథకాన్ని అమల్లోకి తెచ్చింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌, అన్‌లాక్‌లో వారికి ఎంతో ఉపయోగపడింది. ఈ ఏడాది సెప్టెంబరు వరకు బియ్యం పంపిణీ కొనసాగించేలా కేంద్రం చర్యలు తీసుకుంది. మూడు నెలలుగా గోదాములకు సరకు చేరకపోవడంతో కార్డుదారులకు అందడం లేదు. కార్డులోని ఒక్కో సభ్యుడికి అయిదు కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించాలి. ప్రతి నెలా 18 నుంచి 30వ తేదీ వరకు పంపిణీ చేస్తారు. ఈ నెలలో రేషన్‌ దుకాణాలకు సరకు వస్తుందని భావించినా ఇప్పటికీ రాలేదు.

ఆదేశాలు అందాలి..

బియ్యం పంపిణీపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఉత్తర్వులు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆదేశానుసారం సరఫరాకు చర్యలు తీసుకుంటామని ఏఎస్‌వో ఎం.రవిశంకర్‌ స్పష్టం చేశారు.

జిల్లా వివరాలు ఇలా...

జిల్లాలో 1011 చౌకదుకాణాలు 5,33,304 బియ్యం కార్డులు ఉన్నాయి. నెలకు సుమారు 7,100 టన్నుల మేర సరకు కేటాయిస్తారు. ఏప్రిల్‌ నుంచి ప్రక్రియ నిలిచిపోయింది. పీఎంజేకేవై బియ్యం కేటాయింపులు ఉన్నత స్థాయి నుంచి లేకపోవడంతో అందడం లేదని అధికారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని