logo

పెద అమిరంలో నాలుగు హెలిప్యాడ్‌లు

అల్లూరి జయంతి సందర్భంగా జులై 4న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతం చేశారు. పర్యటన నోడల్‌ అధికారి ముత్యాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజితభార్గవ్‌, కలెక్టర్‌ పి.ప్రశాంతి, సంయుక్త కలెక్టర్‌

Published : 30 Jun 2022 04:53 IST

ప్రధాని పర్యటనకు విస్తృత ఏర్పాట్లు


సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న ముత్యాలరాజు, ప్రశాంతి, అధికారులు

భీమవరం పట్టణం, ఉండి, న్యూస్‌టుడే: అల్లూరి జయంతి సందర్భంగా జులై 4న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతం చేశారు. పర్యటన నోడల్‌ అధికారి ముత్యాలరాజు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజితభార్గవ్‌, కలెక్టర్‌ పి.ప్రశాంతి, సంయుక్త కలెక్టర్‌ మురళి తదితరులు ప్రధాని పర్యటించే ప్రాంతాలను బుధవారం పరిశీలించారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పరిశీలించాలని సూచించారు. పెద అమిరంలో బహిరంగ సభ జరిగే ప్రాంతంలో హెలిప్యాడ్‌ల పనులను పర్యవేక్షించారు. మంగళవారం వర్షం కురవడంతో పనుల్లో కొంత ఆలస్యమైందని గుర్తించారు. రెండురోజుల్లో నాలుగు హెలిప్యాడ్‌లతో పాటు సభావేదిక పనులు పూర్తవుతాయని అక్కడి అధికారులు వివరించారు. ప్రధాని పర్యటన ప్రాంతాల్లోకి ప్రైవేటు వాహనాలను రానీయకుండా పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఏఎస్‌ఆర్‌ నగర్‌ పార్కు సుందరీకరణ పనులను వేగవంతం చేశారు. బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ యు.రవిప్రకాశ్‌ దృష్టి సారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని