logo

ఉద్యాన రైతులూ.. ప్రకృతి సాగు వైపు రండి : కలెక్టర్‌

ఉద్యాన రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ కోరారు. పెదపాడు మండలంలోని వేంపాడు, కొక్కిరపాడు గ్రామాల్లో ఆయిల్‌ పామ్‌, ఉద్యాన పంటలను బుధవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రకృతి సాగు చేసే

Published : 30 Jun 2022 04:53 IST


వేంపాడులో అధికారులతో మాట్లాడుతున్న ప్రసన్న వెంకటేశ్‌

పెదపాడు, న్యూస్‌టుడే : ఉద్యాన రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ కోరారు. పెదపాడు మండలంలోని వేంపాడు, కొక్కిరపాడు గ్రామాల్లో ఆయిల్‌ పామ్‌, ఉద్యాన పంటలను బుధవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రకృతి సాగు చేసే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, జిల్లాలో 5,500 హెక్టార్లకు పైగా సాగు చేస్తున్నారని వివరించారు. బహిరంగ మార్కెట్‌లో టన్ను ధర రూ.22,000 వరకు పలుకుతుందన్నారు. అనంతరం కొక్కిరపాడు గ్రామ సచివాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. దస్త్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం అప్పనవీడులో జగనన్న లేఅవుట్లను పరిశీలించారు. ఉద్యానశాఖ ఉపసంచాలకులు పాండురంగారావు, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని