logo

విప్లవ ధ్రువతార అల్లూరి

భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ధ్రువతార వంటి వారని సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్‌, డీఎన్నార్‌ కళాశాల సంయుక్త

Published : 30 Jun 2022 04:53 IST

ప్రదర్శనను ప్రారంభిస్తున్న సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ధ్రువతార వంటి వారని సీబీఐ పూర్వ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్‌, డీఎన్నార్‌ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రకాశంచౌక్‌ నుంచి ఏఎస్‌ఆర్‌ నగర్‌కు బుధవారం జరిగిన ప్రదర్శనలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు, డీఎన్నార్‌ కళాశాల అధ్యక్షుడు జీవీ నరసింహరాజు, గాదిరాజు సుబ్బరాజు, ఏఎస్‌ రాజు తదితరులు పాల్గొన్నారు. భీమవరంలోని పలు విద్యాసంస్థల ఆవరణల్లో సాంస్కృతిక ప్రదర్శనలు బుధవారం కొనసాగాయి. చిన్నారులు దేశభక్తి గీతాలాపనలతో ఉద్యమ స్ఫూర్తి నింపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని