logo

ఉద్యోగం పేరిట మోసం

ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించడంతో బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బుట్టాయిగూడెం మండలం నూతిరామన్నపాలెం గ్రామానికి చెందిన మడకం రాజ్యలక్ష్మి

Published : 30 Jun 2022 04:53 IST

జంగారెడ్డిగూడెం పట్టణం, న్యూస్‌టుడే: ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించడంతో బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్‌బాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బుట్టాయిగూడెం మండలం నూతిరామన్నపాలెం గ్రామానికి చెందిన మడకం రాజ్యలక్ష్మి అనే యువతి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సుందరపల్లి సత్యనారాయణ డీఎంహెచ్‌వో కోటాలో స్టాఫ్‌ నర్స్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని రాజ్యలక్ష్మి వద్ద రూ.లక్ష తీసుకున్నారు. అనంతరం మొహం చాటేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని