logo

ఇవేమి ఛార్జీలు బాబోయ్‌!

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటే హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఛార్జీల బాదుడుతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. డీజిల్‌ సెస్‌ పేరులో ఇటీవల ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మళ్లీ భారం మోపడంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Updated : 02 Jul 2022 06:20 IST

మళ్లీ పెంపుపై ప్రయాణికుల ఆందోళన

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణమంటే హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఛార్జీల బాదుడుతో సామాన్య ప్రజలు బెంబేలెత్తుతున్నారు. డీజిల్‌ సెస్‌ పేరులో ఇటీవల ఛార్జీలు పెంచిన ప్రభుత్వం మళ్లీ భారం మోపడంపై ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

ఆర్టీసీ బస్సుల్లో దూరప్రాంతానికి ప్రయాణించే వారిపై మరింత భారం పడుతోంది. పెంచిన బస్సు ఛార్జీలను శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చారు. 61 కిలో మీటర్ల వరకు ప్రయాణించే వారికి పెద్దగా భారం పడకపోయినా 300, అంతకు మించి ప్రయాణించే వారికి పెనుభారం కానుంది.

పెంచడం సరికాదు..

ఆర్టీసీ ఛార్జీలను వెంటవెంటనే పెంచడం సరికాదు. కరోనా పరిస్థితుల కారణంగా మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీసీ ఛార్జీల పెరుగుదల ‘గోటిచుట్టుపై రోకలి పోటు’ అన్న చందంగా మారింది. డీజిల్‌ ధర పెరిగితే ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలే తప్ప ప్రయాణికులపై మోపడం దారుణం. - మార్కండేయ, ఏలూరు

ప్రజా జీవనానికి ఇబ్బందులు

నిత్యావసరాల ధరలకు తోడు ఆర్టీసీ ఛార్జీలు పెంచుకుంటూ పోతుంటే ప్రజా జీవనానికి ఇబ్బంది ఎదురవుతుంది. పేద, మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఛార్జీలు వసూలు చేయాలే తప్ప డీజిల్‌ ధర పెరిగినప్పుడల్లా పెంచుకుంటూ పోతే ప్రగతి రథ చక్రాలకు ప్రజలు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. - సీహెచ్‌ శ్రీనివాసరావు, ఏలూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని