logo
Published : 06 Aug 2022 06:42 IST

భీమవరంలో ప్రొటోకాల్‌ వివాదం

వ్యాఖ్యాతపై మండలి ఛైర్మన్‌ ఆగ్రహం

వేదికపై వ్యాఖ్యాతను నిలదీస్తున్న మోసేనురాజు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: ‘రాష్ట్రమంత టా శాసనమండలి ఛైర్మన్‌కు ప్రొటోకాల్‌ ఉంటుంది. భీమవరం నియోజకవర్గంలో లేదా? అధికారిక కార్యక్రమంలో సభా వేదికపైకి ఆహ్వానించే విధానం ఇదేనా..? ముఖ్య నాయకు లను సంబోధించడం తెలుసా? అంటూ శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేనురాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.  భీమవరంలో టిడ్కో గృహాలను లబ్ధిదారులకు కేటాయించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా   ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, పురపాలక మంత్రి ఆదిమూలపు సురేష్‌, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చీఫ్‌ విప్‌  ప్రసాదరాజు, కలెక్టర్‌ పి.ప్రశాంతి పాల్గొన్నారు. సభా వేదికపైకి మండలి ఛైర్మన్‌ను ప్రొటోకాల్‌ పాటించకుండా పిలిచారు. వేదికపై ఆయనకు జ్ఞాపిక ఇచ్చేందుకు ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ ఏఎస్‌ రాజు సిద్ధమయ్యారు. కానీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన మావుళ్లమ్మ ఆలయ పాలకవర్గ ఛైర్మన్‌ మానేపల్లి నాగన్నబాబు ఆయన పేరు పిలవలేదు. జ్యోతి వెలిగించేందుకు అతిథులను ఆహ్వానించే క్రమంలో మరోసారి మండలి ఛైర్మన్‌ పేరును విస్మరించారు. దీంతో మోసేనురాజు వెళ్లకుండా కూర్చుండిపోయారు. వెనుక ఉన్నవారు వెళ్లమని సూచిస్తున్న తరుణంలో వ్యాఖ్యాతకు నా పేరు పిలవడం ఇష్టంలేదు. నేను జ్యోతి వెలిగించకూడదను కున్నారు. అందుకే వెళ్లనని భీష్మించారు. దీంతో కలెక్టర్‌ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆయనను సముదాయించి జ్యోతి వెలిగించే కార్యక్రమానికి తీసుకెళ్లారు.
 

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts