logo

దారి గల్లంతు!

ఎర్రకాలువ ఉద్ధృతితో మాధవరం- కంసాలిపాలెం మధ్య ఉన్న కాజ్‌వేతో పాటు మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి.

Published : 10 Aug 2022 04:52 IST

ఎర్ర కాలువ ఉద్ధృతితో నిలిచిన రాకపోకలు

కొట్టుకుపోయిన మాధవరం-కంసాలిపాలెం రోడ్డు

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: ఎర్రకాలువ ఉద్ధృతితో మాధవరం- కంసాలిపాలెం మధ్య ఉన్న కాజ్‌వేతో పాటు మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి. రహదారి కొట్టుకుపోవడంతో తాడేపల్లిగూడెం మండలం మాధవరం, నిడదవోలు మండలం కంసాలిపాలెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మాధవరం నిడదవోలు రహదారిపై కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నందమూరు అక్విడక్టు వద్ద ఎర్రకాలువ మంగళవారం సాయంత్రానికి 31 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మరో అడుగు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మారంపల్లి, ఆరుళ్ల, నందమూరు, జగన్నాథపురం, మాధవరం, వీరంపాలెం, పంట పొలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాలువలోకి పశువులు దిగకుండా చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా చేపలు పట్టేవారికి ఎర్రకాలువ ఆదాయ వనరుగా మారింది. నల్లమోసులు అనే అరుదైన రకం చేపలు వరద సమయంలోనే వస్తాయి. కిలో రూ.400 వరకు విక్రయిస్తున్నారు.

కలెక్టర్‌ ఆరా.. ఎర్రకాలువ వరద ఉద్ధృతిని కలెక్టర్‌ ప్రశాంతి మంగళవారం పరిశీలించారు. నందమూరు వద్ద ఎర్రకాలువ అక్విడక్టును పరిశీలించి నీటిమట్టం వివరాలను తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని