logo

స్ఫూర్తిప్రదాత సుభద్రాదేవి

విద్యార్థి దశలోనే ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన సుభద్రాదేవి అందరికీ స్ఫూర్తిప్రదాత అని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. కాళ్ల మండలం పెదఅమిరంలో మహాత్మాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో సర్వోదయ మండలి

Published : 10 Aug 2022 04:52 IST

పెదఅమిరంలో కలెక్టర్‌ను సత్కరించిన సర్వోదయ మండలి సభ్యులు

పెదఅమిరం (ఉండి), న్యూస్‌టుడే: విద్యార్థి దశలోనే ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన సుభద్రాదేవి అందరికీ స్ఫూర్తిప్రదాత అని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. కాళ్ల మండలం పెదఅమిరంలో మహాత్మాగాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ ప్రాంగణంలో సర్వోదయ మండలి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అమరవీరుల స్ఫూర్తి కార్యక్రమంలో ఆమె పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. గ్రామ స్వరాజ్యాన్ని చేరువ చేసేలా పద్మశ్రీ ఎంఆర్‌రాజు పెదఅమిరంలో గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ను ఏర్పాటుచేశారన్నారు. ఆయన సతీమణి సుభద్రాదేవి విద్యార్థి దశలో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన దేశ భక్తురాలని కొనియాడారు. అనంతరం పలువురు ప్రముఖులు కలెక్టర్‌ ప్రశాంతిని ఘనంగా సత్కరించారు. అనంతరం డీవీ బాలసుబ్రహ్మణ్యం రచించిన ‘మౌన వనం’ పుస్తకాన్ని కలెక్టర్‌ ఆవిష్కరించారు. సర్వోదయ మండలి సభ్యులు ఇందుకూరి ప్రసాదరాజు, చెరుకువాడ రంగసాయి, అరుణోదయ మనోవికాస కేంద్రం నిర్వాహకులు అరుణాదేవి, భగత్‌సింగ్‌ సేవా విజ్ఞాన కేంద్రం, తబిత వృద్ధాశ్రమం నిర్వాహకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని