logo

29 టన్నుల రేషన్‌బియ్యం పట్టివేత

పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 29 టన్నుల రేషన్‌ బియ్యాన్ని గురువారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు విజిలెన్స్‌ ఎస్సై రంజిత్‌కుమార్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు

Published : 12 Aug 2022 02:46 IST

కలపర్రులో విజిలెన్స్‌ శాఖ అధికారులు పట్టుకున్న రేషన్‌ బియ్యం లారీ

పెదపాడు, న్యూస్‌టుడే: పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా వద్ద లారీలో అక్రమంగా తరలిస్తున్న 29 టన్నుల రేషన్‌ బియ్యాన్ని గురువారం తెల్లవారుజామున పట్టుకున్నట్లు విజిలెన్స్‌ ఎస్సై రంజిత్‌కుమార్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందిన ఆత్మకూరి జగదీష్‌, తంగెళ్లపల్లి కిషోర్‌లు బియ్యాన్ని తరలిస్తుండగా వాహన తనిఖీల్లో గుర్తించి పట్టుకున్నామన్నారు. బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ పెదపాడు డిప్యూటీ తహశీల్దారు ప్రమోద్‌కుమార్‌కు,  జగదీష్‌, కిషోర్‌లను, లారీని పెదపాడు పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. తనిఖీల్లో కలపర్రు వీఆర్వో వెంకటేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని