logo

పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలు

దేశంలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ డీజీఎం కిషోర్‌ తెలిపారు. స్థానిక పెద్ద రైల్వే స్టేషన్లో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన

Published : 12 Aug 2022 02:46 IST

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: దేశంలో ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రదేశాలకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ డీజీఎం కిషోర్‌ తెలిపారు. స్థానిక పెద్ద రైల్వే స్టేషన్లో గురువారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘స్వదేశీ దర్శన్‌ పర్యాటక రైలు’ పేరుతో మహాలయ పిండ ప్రదాన యాత్రను ఈ నెల 15వ తేదీ ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి ప్రారంభమవుతుందన్నారు.  ఈ రైలు విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్‌ మీదుగా గయ, వారణాసి, ప్రయాగ్‌ సంగం పర్యటించి 20వ తేదీ రాత్రికి తిరిగి చేరుకుంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్‌టీసీ సదుపాయం ఉంటుందన్నారు. ఈ రైలులో ప్రయాణించదలిచిన వారు ‌www.irctctourism.com వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. లేదా 82879 32312, 97013 60675 నంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని