logo

ముంపులోనే లంకలు

గోదావరి వరద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు శనివారం సుమారు 14 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో జిల్లాలోని లంక భూములు ముంపులోనే ఉన్నాయి.

Published : 14 Aug 2022 03:51 IST

రాకపోకలు బంద్‌


కరుగోరుమిల్లిలో గోదావరి ఉద్ధృతి

ఆచంట, నరసాపురం గ్రామీణ,  న్యూస్‌టుడే: గోదావరి వరద నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు శనివారం సుమారు 14 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో జిల్లాలోని లంక భూములు ముంపులోనే ఉన్నాయి. తీరం వెంబడి కొబ్బరితోటలు, ఆలయాలు, పుష్కరఘాట్లు, పలు భవనాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. వరద ఉద్ధృతి తీవ్రంగా ఉండటంతో నదిపై పడవల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆచంట మండలం అయోధ్యలంక, మర్రిమూల, అనగారలంక, పెదమల్లంలంక వాసులు కోనసీమ జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. మరో వైపు డ్రెయిన్ల ఉద్ధృతికి ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాల్లో సుమారు 2 వేల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. వద్దిపర్రు, ఆచంట, కట్టుపాలెం, మేడపాడు, గుమ్మలూరు, చింతలగరువు ప్రాంతాల్లో వరి పొలాలు, ఆచంట వేమవరంలో నారుమడులు ముంపులో ఉన్నాయి.  నరసాపురం రేవు నుంచి పంటు రాకపోకలు నిలిచాయి.  పట్టణంలోని రెండోవార్డు లాకుపేటలో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.  ఇసుక ర్యాంపు ప్రాంతం ముంపునకు గురైంది. నరసాపురం మండలంలో సరిపల్లి, గొంది-చిట్టవరం జమ్ముకోడు, రుస్తుంబాద, నత్తలావ డ్రెయిన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. కొత్త నవరసపురంలో శ్మశానవాటిక, అంగన్‌వాడీ కేంద్రాలకు వరద నీరు చేరింది. గొంది-చిట్టవరం జమ్ముకోడు పొంగి ప్రవహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని