logo

లోక్‌ అదాలత్‌లో 5,050 కేసుల పరిష్కారం

జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా 5,050 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ్‌కుమార్‌ తెలిపారు.

Published : 14 Aug 2022 03:14 IST

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌ ద్వారా 5,050 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమ్‌కుమార్‌ తెలిపారు. 134 క్రిమినల్‌, 4,638 సివిల్‌, 229 ప్రీ లిటికేషన్‌ కేసులున్నాయన్నారు. మోటారు వాహన ప్రమాదకేసుల్లో రూ. 3.58 కోట్ల నష్టపరిహారం మంజూరుకు అవార్డులు జారీ చేశామన్నారు. ఏలూరు కోర్టులో 1328 కేసులు, తాడేపల్లిగూడెం 557, తణుకు 350, కొవ్వూరు 603, నరసాపురం 487, భీమవరం 480, చింతలపూడి 366, పాలకొల్లు, 379, జంగారెడ్డిగూడెం కోర్టుల్లో 500 కేసులు పరిష్కరించినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి రాజేశ్వరి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు