logo

యాప్‌ తో యాతన

ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు గురువారం ఉదయం 9.30కు హాజరు వేసేందుకు యాప్‌ను ఓపెన్‌ చేశారు. కోడ్‌ రాకపోవటంతో.. 10.30 వరకూ ప్రయత్నించినా ఫలితం లేదు. మొదటి పీరియడ్‌లో పాఠాలు చెప్పకుండా ఇలా యాప్‌తోనే తంటాలు పడ్డారు. హాజరు వేయకపోతే

Updated : 15 Aug 2022 05:16 IST

హాజరు వేసేందుకు గురువుల కుస్తీ

పాఠాలు చెప్పే సమయం వృథా

ఏలూరు జిల్లా దెందులూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు గురువారం ఉదయం 9.30కు హాజరు వేసేందుకు యాప్‌ను ఓపెన్‌ చేశారు. కోడ్‌ రాకపోవటంతో.. 10.30 వరకూ ప్రయత్నించినా ఫలితం లేదు. మొదటి పీరియడ్‌లో పాఠాలు చెప్పకుండా ఇలా యాప్‌తోనే తంటాలు పడ్డారు. హాజరు వేయకపోతే ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారని.. తరగతులు మాని దీనిపైనే కూర్చోవాల్సి వస్తోందని.. ఆ ఉపాధ్యాయుడు వాపోయారు.

 ‘పాఠాలు చెప్పేందుకు వస్తున్నామో లేక ఈ యాప్‌తో పాట్లు పడేందుకు వస్తున్నామో అర్థం కావటం లేదు. మా పాఠశాలలో మొత్తం 18 సెక్షన్లున్నాయి. 18 మంది ఉపాధ్యాయులు ఉదయం.. వచ్చింది మొదలు ఇదే పనిపై ఉన్నా ఫలితం ఉండటం లేదు. 10.30లోగా చేయాల్సిందేనంటూ ఒత్తిడి ఉంటోంది. కొత్త యాప్‌ మరీ మొరాయిస్తోంది. దీంతో ఇటు హాజరు నమోదు కాక.. అటు పాఠాలపైనా దృష్టిపెట్టలేక ఒత్తిడికి గురవుతున్నాం.’

ఇది భీమవరం మండలంలోని ఓ ఉపాధ్యాయుడి ఆవేదన


ఈనాడు డిజిటల్‌, ఏలూరు

విద్యార్థుల హాజరులో పారదర్శకత కోసం ప్రభుత్వం సాంకేతికతను అమలు చేస్తోంది. ఆలోచన మంచిదైనా ఆచరణలో ఉన్న ఇబ్బందులు. ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేయడంతోపాటు విద్యార్థుల చదువుకు అవాంతరం కలిగిస్తున్నాయి. యాప్‌ ఓపెన్‌ కాకపోవటం, బఫర్‌ కావటం, సర్వర్‌, అంతర్జాల సమస్యలతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

చాలా పాఠశాలల్లో మొదటి పీరియడ్‌ ఉష్‌కాకి అవుతోంది. 10.30లోగా హాజరు ప్రక్రియ పూర్తి చేయకుంటే సంజాయిషీ చెప్పుకోవాల్సిన పరిస్థితి రావటంతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో బోధనపై దృష్టి సారించలేకపోతున్నారు. విలువైన పాఠశాల సమయం వృథా అవుతోంది. అంతర్జాల సంకేతాలు అంతంతమాత్రంగా ఉండే వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం తదితర ప్రాంతాల్లో ఉపాధ్యాయుల అవస్థలు వర్ణనాతీతం. ఈ యాప్‌లో ఒక్కసారి నమోదు చేస్తే మార్పులు చేసే అవకాశం లేదు. దీంతో దూర ప్రాంతాల విద్యార్థులు ఆలస్యంగా వస్తే వారికి గైర్హాజరుగా నమోదవుతోంది. అమ్మఒడికి హాజరును ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో వారికి నష్టం జరుగుతోంది.


పరిష్కరిస్తాం: కొత్తగా యాప్‌లు నవీకరిస్తున్న నేపథ్యంలో కొన్ని సమస్యలు రావటం సహజం. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. అందరూ ఒకేసారి యాప్‌ వినియోగించటంతో సర్వర్‌ సమస్య ఉండవచ్చు. త్వరలో పరిష్కరిస్తాం.

- -వెంకట రమణ, డీఈవో, పశ్చిమగోదావరి


న్యాయం చేయలేకపోతున్నాం

యాప్‌లను నవీకరించినా నెట్వర్క్‌, సర్వర్‌ సమస్యలతో పనిచేయటం లేదు. మొదటి పీరియడ్‌ అంతా యాప్‌లు పట్టుకుని వేలాడాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నాం. రిజిస్టర్‌ హాజరు మాత్రమే తీసుకుంటే సమయం ఆదా అవుతుంది. బోధనకు సమయం కేటాయించొచ్చు.  

-రెడ్డిదొర, ఏపీటీఎఫ్‌, ఏలూరు జిల్లా అధ్యక్షుడు


ప్రత్యామ్నాయం చూడాలి

యాప్‌లో హాజరు నమోదు ప్రక్రియతో విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాల్సి ఉంది. ముందుగా రిజిష్టర్‌ ద్వారా నమోదు చేసి కాల పరిమితి లేకుండా యాప్‌లో చేసేలా ఆదేశాలివ్వాలి.

-సాయిశ్రీనివాస్‌, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని