logo

పెరిగిన కూరగాయల ధరలు

పర్వదినాలు, వివాహ శుభకార్యక్రమాలకు అనుకూల కాలం కావడంతో కూరగాయల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో కూరగాయలు, ఆకుకూరల ధరలు పెరిగాయి. గత కొన్ని వారాలుగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కూరగాయల తోటలు దెబ్బతినడం కూడా ధరల పెరుగుదలకు కారణమే. హోల్‌సేల్‌ మార్కెట్‌ అయిన తాడేపల్లిగూడెం

Published : 15 Aug 2022 04:41 IST

శ్రావణ మాసం పర్వదినాలు, శుభకార్యాలతో పెరిగిన వినియోగం

అందుబాటులోకి ఆగాకర, చిక్కుళ్లు

తాడేపల్లిగూడెం, న్యూస్‌టుడే: పర్వదినాలు, వివాహ శుభకార్యక్రమాలకు అనుకూల కాలం కావడంతో కూరగాయల వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో కూరగాయలు, ఆకుకూరల ధరలు పెరిగాయి. గత కొన్ని వారాలుగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కూరగాయల తోటలు దెబ్బతినడం కూడా ధరల పెరుగుదలకు కారణమే. హోల్‌సేల్‌ మార్కెట్‌ అయిన తాడేపల్లిగూడెం బ్రహ్మానందరెడ్డి మార్కెట్‌లో ధరలే ఇంచుమించు జిల్లా అంతటా ఉంటాయి. ఇక్కడి నుంచే జిల్లాలోని మార్కెట్లకు కూరగాయలు తీసుకెళ్తారు. ఆకు కూరలు భారీగా పెరిగాయి. కొత్తిమీర కట్ట ఈ వారం రూ.30కి విక్రయించారు. తోటకూర, గోంగూర కట్టలు జత రూ.25కు ఇస్తున్నారు. గతంలో జత రూ.10 నుంచి రూ.15 లోపే ఉండేవి. పుదీనా కట్ట రూ.15 వరకూ ఎన్నడూలేని విధంగా ఉంది.  సీజనల్‌ కూరగాయలు కూడా మార్కెట్లో ప్రవేశించాయి. వీటి అమ్మకాల జోరు ఎక్కువగా ఉంది. ఆగాకర కాయ కిలో రూ.120 వరకూ విక్రయిస్తున్నారు. చిక్కుళ్లు కిలోరూ.100కు అమ్ముతున్నారు. పొట్లకాయలు కూడా మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. కానీ వీటి ధరలు ఒక్కటి రూ.15 చేసి అమ్మారు. ఈవారం కొత్తగా బెంగుళూరు సోసోలు(వంకాయలు)గా పిలిచేవి కిలో రూ.100కి విక్రయించారు. ఈ కొత్తరకం కూరగాయలను మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఉల్లి ధర స్థిరంగా కొనసాగుతోంది. కిలో రూ.15 నుంచి నాణ్యమైనవి రూ.25 వరకూ అమ్మారు. మిర్చి ధర ఘాటెక్కింది. గతంలో కిలో రూ.50 ఉండేది. ప్రస్తుతం కిలో రూ.80కి అమ్మారు. దొండ, బెండ, దోసకాయల ధరలు కూడా గతవారం మాదిరిగానే స్థిరంగా ఉన్నాయి. కిలో రూ.50 వద్దే అమ్మకాలు కొనసాగుతున్నాయి. పూజలకు ఎక్కువగా వినియోగిస్తుండటంతో నిమ్మ ధర ఒకటి రూ.2కి అమ్ముతున్నారు. నిమ్మకు గడిచిన రెండు నెలల కాలంలో ఇంతటి ధర లేదు. కొబ్బరికాయలు కూడా రూ.20కే అమ్ముతున్నారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని