logo

సందడిగా మావుళ్లమ్మ జాతర

భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి శ్రావణమాస జాతరను ఆదివారం వైభవంగా నిర్వహించారు. సుంకరపద్దయ్య వీధిలో అభయాంజనేయ స్వామి ఆలయ కూడలి వద్ద జాతర కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన హంస వాహనంపై అమ్మవారి ప్రతిమ, జాతీయ జెండాలు ఏర్పాటు

Published : 15 Aug 2022 04:41 IST

భీమవరం ఆధ్యాత్మికం, న్యూస్‌టుడే: భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారి శ్రావణమాస జాతరను ఆదివారం వైభవంగా నిర్వహించారు. సుంకరపద్దయ్య వీధిలో అభయాంజనేయ స్వామి ఆలయ కూడలి వద్ద జాతర కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన హంస వాహనంపై అమ్మవారి ప్రతిమ, జాతీయ జెండాలు ఏర్పాటు చేసి ఊరేగించారు. కేరళ కళాకారుల డప్పు వాయ్యిదాలు, శక్తి వేషధారులు, బుట్టబొమ్మలు, కోయ నృత్యాల మధ్య మావుళ్లమ్మ ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని