logo

అమృత మహోత్సవంతో ఆరంభం

పునర్విభజన అనంతరం ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్‌ భవన సముదాయం పక్కనే ఉన్న స్థలంలో ఆదివారం సన్నాహక కవాతు నిర్వహించారు. జాతీయ పతాకం ఆవిష్కరణ, పోలీసు వందనం, విద్యార్థుల

Published : 15 Aug 2022 04:41 IST

భీమవరం కలెక్టరేట్‌ ప్రాంగణంలో నేడు వేడుకలు

నమూనా ప్రదర్శనలో గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: పునర్విభజన అనంతరం ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కలెక్టరేట్‌ భవన సముదాయం పక్కనే ఉన్న స్థలంలో ఆదివారం సన్నాహక కవాతు నిర్వహించారు. జాతీయ పతాకం ఆవిష్కరణ, పోలీసు వందనం, విద్యార్థుల బ్యాండు ప్రదర్శన, వివిధ శాఖల శకటాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలపై స్టాళ్లను కలెక్టర్‌ పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఎస్పీ యు.రవిప్రకాశ్‌, ఇన్‌ఛార్జి జిల్లా సంయుక్త కలెక్టర్‌, డీఆర్వో కె.కృష్ణవేణి, ఆర్డీవో దాసి రాజు పాల్గొన్నారు.

ఉద్యమకారుల కుటుంబ సభ్యులకు సన్మానం

అమృత మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర ఉద్యమకారుల కుటుంబ సభ్యులను కలెక్టరేట్‌ వద్ద సోమవారం జరిగే వేడుకల్లో సన్మానించనున్నారు. పస్తుల సాగరం, భూపతిరాజు సుబ్బతాతరాజు, షేక్‌ అలీ సాహెబ్‌, కోటమర్తి కనకమహాలక్ష్మి, బర్మా కేశవరావు, తటవర్తి కృష్ణమూర్తి, తటవర్తి సుబ్బారావు, అయ్యగారి అమ్మిరాజు, గరగ వెంకటరమణమ్మ, ఉద్దరాజు వెంకట్రాజు, అడవి బాపిరాజు, ప్రత్తి శేషయ్య, పాలకోడేటి సత్యనారాయణశర్మ, గొట్టుముక్కల రామచంద్రరాజు కుటుంబ సభ్యులకు ఈ మేరకు అధికారులు సమాచారం ఇచ్చారు.

శకటాలు సిద్ధం..

స్వాతంత్య్ర వేడుకల్లో పలు శాఖల శకటాలు సందడి చేయనున్నాయి. విద్య, గృహ నిర్మాణం, వైద్య ఆరోగ్యశాఖ, రవాణా, వ్యవసాయ, సచివాలయ, ఆర్‌డబ్ల్యూఎస్‌, పశుసంవర్ధకశాఖ, డ్వామా తదితర శాఖల శకటాలు సిద్ధం చేశారు.  

* కలెక్టరేట్‌ కార్యాలయాన్ని విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భారీ జాతీయ జెండాను కార్యాలయంపై ఏర్పాటు చేశారు. వివిధ శాఖల కార్యాలయాలను మూడు రంగుల జెండాలతో అలంకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని