logo

ఉత్సవ ఏర్పాట్లలో అపశ్రుతి

స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమైన సొసైటీ ఉద్యోగి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన టి.చిన్న వెంకటరెడ్డి(36) స్థానిక సహకార సంఘ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు.

Published : 15 Aug 2022 04:41 IST

విద్యుదాఘాతంతో సహకార ఉద్యోగి మృతి

పెనుమంట్ర, న్యూస్‌టుడే:  స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమైన సొసైటీ ఉద్యోగి విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం కొయ్యేటిపాడు గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన టి.చిన్న వెంకటరెడ్డి(36) స్థానిక సహకార సంఘ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తున్నారు. సోమవారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి జెండా ఆవిష్కరణ కోసం ఇనుప గొట్టాన్ని నిలబెడుతుండగా పైనుంచి వెళ్లిన విద్యుత్తు తీగలు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై పడిపోయారు. ఆయనను స్థానికులు ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు చెప్పారు. ఈయనకు భార్య, కుమార్తె ఉన్నారు. సౌమ్యుడిగా గుర్తింపు ఉన్న వెంకటరెడ్డి మృతిని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.      

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని