logo

చోరీ సొత్తుతో దొంగ అరెస్టు

నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లికి చెందిన 63 ఏళ్ల వృద్ధుడి బ్యాగు నుంచి రూ.రెండు లక్షల నగదు తస్కరించాడన్న ఆరోపణపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అనిమిల కిశోర్‌ను అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై దివాకర్‌ యాదవ్‌ ఆదివారం చెప్పారు. బాధిత వృద్ధుడు

Published : 15 Aug 2022 04:41 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: నర్సీపట్నం మండలం పెదబొడ్డేపల్లికి చెందిన 63 ఏళ్ల వృద్ధుడి బ్యాగు నుంచి రూ.రెండు లక్షల నగదు తస్కరించాడన్న ఆరోపణపై పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అనిమిల కిశోర్‌ను అరెస్టు చేసినట్లు పట్టణ ఎస్సై దివాకర్‌ యాదవ్‌ ఆదివారం చెప్పారు. బాధిత వృద్ధుడు ఆంధ్రా బ్యాంకు నుంచి నగదు డ్రా చేసి బ్యాగులో పెట్టుకుని ఆటో ఎక్కడం గమనించిన కిశోర్‌ అదే ఆటో ఎక్కి.. బ్యాగును కత్తిరించి అందులోని నగదుతో పరారయ్యాడని ఎస్సై పేర్కొన్నారు. ఇదే నిందితుడు పెదబొడ్డేపల్లి మరిడిమాంబ ఆలయ ప్రాంతంలో ఓ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బీరువాలో అర తులం బంగారు నగ దొంగలించాడన్నారు. వేలిముద్రలను విశ్లేషించినప్పుడు పాత నేరస్తుడైన కిశోర్‌ ఈ నేరాలకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. కొన్నేళ్లుగా జైల్లో ఉండి ఇటీవల విడుదలై వచ్చి నర్సీపట్నం ప్రాంతంలో దొంగతనాలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఎస్సైలు ధనుంజయనాయుడు, గోవిందరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని