logo

స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీ

ఏలూరు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ కింద రూ.1.72 కోట్ల రుణాలను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విశ్వరూప్‌ పంపిణీ చేశారు. స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన తిలకించారు.

Published : 16 Aug 2022 05:24 IST


మహిళలకు నమూనా చెక్కు అందజేస్తున్న మంత్రి విశ్వరూప్‌

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఏలూరు జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు లింకేజీ కింద రూ.1.72 కోట్ల రుణాలను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి విశ్వరూప్‌ పంపిణీ చేశారు. స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన తిలకించారు. వ్యవసాయ, ఉద్యాన, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్‌, ఉపాధి హామీ, బీసీ కార్పొరేషన్‌, విద్యా తదితర శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటుచేశారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో స్త్రీనిధి కింద 4,551 సంఘాలకు చెందిన 13,037 మంది మహిళలకు రూ.40.20 కోట్లు, 1,742 స్వయం సహాయక సంఘాలకు రూ.1.72 కోట్ల నమూనా చెక్కులు అందజేశారు. ఉన్నతి పథకం కింద 97 మహిళా సంఘాలకు రూ.59.23 లక్షలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, హైర్‌ ఆర్డర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కింద ముగ్గురు మహిళలకు రూ.19.29 లక్షలను రుణాలుగా పంపిణీ చేశారు. తొమ్మిది మంది దివ్యాంగులు, వృద్ధులకు రూ.94,500 విలువైన ఉపకరణాలను అందజేశారు. డ్వామా, వ్యవసాయ, డీఆర్‌డీఏ శాఖల స్టాళ్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని