logo

రుద్రంకోట నిర్వాసితుల సమస్యకు పరిష్కారం

రుద్రంకోట నిర్వాసితులు కట్కూరు పునరావాస కాలనీలో తాత్కాలికంగా నివాసం ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఆర్డీవో ఝాన్సీరాణి తెలిపారు. రుద్రంకోటకు చెందిన 15 కుటుంబాల నిర్వాసితులు...

Published : 16 Aug 2022 05:24 IST

తాత్కాలిక నివాసానికి ఇబ్బంది లేదు : ఆర్డీవో

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: రుద్రంకోట నిర్వాసితులు కట్కూరు పునరావాస కాలనీలో తాత్కాలికంగా నివాసం ఉండడానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఆర్డీవో ఝాన్సీరాణి తెలిపారు. రుద్రంకోటకు చెందిన 15 కుటుంబాల నిర్వాసితులు చల్లావారిగూడెంలోని నిర్వాసిత కాలనీలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని కొందరు ఒత్తిడి చేశారు. దీనిపై ‘తల దాచుకోవడానికి వస్తే తరమాలని చూస్తున్నారు’ శీర్షికన ‘ఈనాడు’లో సోమవారం ప్రచురితమైన కథనానికి ఆర్డీవో స్పందించారు. సంబంధిత అధికారులతో పాటు గుత్తేదారులతో మాట్లాడారు. నిర్వాసితులకు కూడా సమాచారం అందించామన్నారు. వరద తగ్గేవరకు వారు తమ బంధువుల ఇళ్లలో ఉండవచ్చని చెప్పారు. అధికారుల ఆదేశాల మేరకు గుత్తేదారులు తాగునీటిని సరఫరా చేశారు. ఇబ్బంది తొలగిందని రుద్రంకోటకు చెందిన నిర్వాసితుడు దారా కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని