logo

ప్రభుత్వ విధానాలతో విద్యారంగానికి నష్టం : ఎమ్మెల్సీ

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విద్యారంగానికి నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. స్థానిక యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో...

Published : 16 Aug 2022 05:24 IST


మాట్లాడుతున్న సాబ్జీ

ఏలూరు విద్యా విభాగం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో విద్యారంగానికి నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ అన్నారు. స్థానిక యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ఉపాధ్యాయుల బోధనకు ఇబ్బంది కలిగిస్తోన్న పలు రకాల యాప్‌లను రద్దు చేయాలన్నారు. నూతన విద్యా విధానం పేరుతో ప్రాథమిక పాఠశాలలను విలీనం చేయడంతో అనేకమంది పేద విద్యార్థులు నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ కొలువులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులపై పనిభారాన్ని తగ్గించాలన్నారు. సమావేశంలో సంఘ నాయకులు రవికుమార్‌, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని