logo
Published : 16 Aug 2022 05:24 IST

తిమ్మయ్యపాలెంలో గాంధీజీ విగ్రహం ధ్వంసం

ఉంగుటూరు, న్యూస్‌టుడే:  దేశమంతా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు నిర్వహించుకుంటున్న సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన ఉంగుటూరు మండలం తిమ్మయ్యపాలెంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తిమ్మయ్యపాలెంలోని చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం వద్ద రెండేళ్ల కిందట గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలకు అక్కడ జాతీయ జెండా ఎగుర వేస్తున్నారు. సోమవారం ఉదయం జెండావిష్కరణ ఏర్పాట్లు చేసేందుకు పంచాయతీ సిబ్బంది అక్కడకు వెళ్లగా విగ్రహం ధ్వంసం చేసి ఉండటాన్ని గుర్తించారు. ఈ మేరకు పోలీసులుకు ఫిర్యాదు చేశామని సర్పంచి శ్రీదేవి తెలిపారు. చేబ్రోలు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని