logo

జెండా స్తూపం నిర్మాణాన్ని అడ్డుకోవడం దుర్మార్గం : పితాని

మార్టేరు సెంటర్‌లో జాతీయ జెండా స్తూపం నిర్మాణాన్ని రాజకీయ దురుద్దేశంతో అడ్డుకోవడం అత్యంత దారుణమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.

Published : 16 Aug 2022 05:38 IST


జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి పితాని

మార్టేరు(పెనుమంట్ర), న్యూస్‌టుడే: మార్టేరు సెంటర్‌లో జాతీయ జెండా స్తూపం నిర్మాణాన్ని రాజకీయ దురుద్దేశంతో అడ్డుకోవడం అత్యంత దారుణమని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సోమవారం తెదేపా ఆధ్వర్యంలో ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మార్టేరులో జాతీయ జెండాను ఆవిష్కరించిన పితాని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గ్రామగ్రామాన ఘనంగా నిర్వహిస్తూ వచ్చామన్నారు. స్తూపం నిర్మాణానికి మాట ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే వద్దన్నారని చెప్పడం సరికాదన్నారు. రాజకీయ పార్టీ జెండా స్తూపం అయితే అడ్డుకున్నా తప్పులేదన్నారు. భారత జాతి గౌరవాన్ని పెంచే జాతీయ జెండా ఎగురవేసే ప్రయత్నానికి మోకాలడ్డు పెట్టడం దుర్మార్గమని చెప్పారు. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఆచంట ఎంపీపీని కాదని అక్కడ జెండా ఎగరవేసే ప్రయత్నం చేశారన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులకు ఆయా స్థాయిల్లో జెండా ఎగరవేసే అధికారం ఉంటుందన్నారు. అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్యం అవహేళన, ప్రజాప్రతినిధులను అగౌరవపరిచే విధంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ప్రయత్నించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని