logo
Published : 17 Aug 2022 06:05 IST

భూ వివాదం పరిష్కారం కోరుతూ ఆర్డీవో కార్యాలయం దిగ్బంధం

ఐదు గంటలకుపైగా కొరుటూరు నిర్వాసితుల ఆందోళన

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: వివాదం లేని భూములు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కొరుటూరు నిర్వాసితులు జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయాన్ని మంగళవారం దిగ్బంధించారు. సుమారు ఐదు గంటల పాటు గేటు ఎదుట బైఠాయించారు. కొరుటూరు నిర్వాసితులకు జీలుగుమిల్లి మండలం పి.నారాయణపురంలో పునరావాస కాలనీ నిర్మించారు. అక్కడే భూమికి భూమి కింద సుమారు 300 ఎకరాలు కొనుగోలు చేసి ఇచ్చారు. అవి వివాదాస్పదమైనవి కావడంతో గడచిన 13 ఏళ్లుగా సమస్య నెలకొంది. ఇప్పటివరకు నిర్వాసిత గ్రామంలోని గిరిజనులు ఇటీవల పునరావాస గ్రామాలకు వచ్చారు. వారికిచ్చిన భూముల్లోకి అడుగుపెట్టి సాగుచేసే పరిస్థితులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రోడ్డెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు ఐదు నెలలుగా పనులు లేక, భూములు సాగు చేయలేక సతమతమవుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. వివాదాలున్న భూములు కొనుగోలుచేసి మా జీవితాలను సమస్యల్లోకి నెట్టారంటూ వాపోయారు. నిర్వాసిత గ్రామాన్ని ఖాళీ చేయించే వరకు ఒత్తిడి చేసిన రెవెన్యూ అధికారులు ఇప్పుడు ముఖం చాటేశారన్నారు. వెంటనే వివాదాన్ని పరిష్కరించండి లేదా వివాదం లేని భూములైనా ఇవ్వండంటూ విన్నవించారు. కార్యాలయం వద్దే భోజనాలు చేశారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పే వరకు కదిలేది లేదని చెప్పడంతో.. నారాయణపురం వచ్చి భూ వివాదాన్ని పరిష్కరిస్తామని ఆర్డీవో ఝాన్సీరాణి నిర్వాసితులకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రవి, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తెల్లం రామకృష్ణ, సీపీఎం మండల కార్యదర్శి జీవరత్నం, నాయకులు పాల్గొన్నారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని