logo

మా ఇబ్బందులు పట్టవా?

ఆరోగ్య భత్యం బకాయిలు చెల్లించాలని మున్సిపల్‌ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు కోరారు. ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ విభాగ కార్మికులు,

Published : 17 Aug 2022 06:05 IST

పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం : ఒప్పంద కార్మికులు

నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ఆరోగ్య భత్యం బకాయిలు చెల్లించాలని మున్సిపల్‌ ఒప్పంద పారిశుద్ధ్య కార్మికులు కోరారు. ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇంజినీరింగ్‌ విభాగ కార్మికులు, స్కూల్‌ స్వీపర్లు, విలీనమైన ఏడు పంచాయతీల పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి  పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. అనంతరం డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్వరరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. నగరంలో 1200 మంది సేవలందిస్తున్నారు. నాయకులు సోమయ్య, జగన్నాథరావు, సాయిబాబు, గోపీ, విజయలక్ష్మి, సత్యనారాయణ, లావేటి కృష్ణారావు, నాగమణి పాల్గొన్నారు.

22 నుంచి నిరవధిక ఆందోళన.. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తే ఈ నెల 22 నుంచి పనులు నిలిపివేస్తాం. జీతాల బకాయిలు ఇవ్వకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. పీఆర్సీ ఎరియర్స్‌ రూ.64 లక్షలు రావాల్సి ఉంది. 7 నెలలుగా హెల్త్‌ అలవెన్సు బకాయి రావాల్సి ఉంది.

  - బి.సోమయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు


పరికరాలు ఇవ్వడం లేదు.. పారిశుద్ధ్య కార్మికులు పనిచేసేందుకు సరైన పరికరాలు ఇవ్వడం లేదు. గంపలు, చీపుర్లు, పారలు, తోపుడు బండ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. సబ్బులు, చెప్పులు, కొబ్బరినూనె కూడా సకాలంలో అందడం లేదు. సొంత డబ్బులు వెచ్చించి కొనుగోలు చేస్తున్నాం.
- టి.సత్యవతి, కార్మికురాలు


అనారోగ్యానికి గురవుతున్నాం.. భూగర్భ డ్రెయినేజీ పారిశుద్ధ్య పనులు చేయడంతో అనారోగ్యానికి గురవుతున్నాం. హెల్త్‌ అలవెన్సులు ఇవ్వకపోవడంతో వైద్యం చేయించుకునేందుకు డబ్బులులేక అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.  

-ఎ.జాన్‌ బాబు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని