logo
Published : 17 Aug 2022 06:05 IST

తెలుసుకోండి...ఎంచుకోండి

ఏలూరు విద్యా విభాగం, ఆగిరిపల్లి, న్యూస్‌టుడే

ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీఈఏపీ సెట్‌ పూర్తి అయి విద్యార్థులకు ర్యాంకులు కేటాయించారు. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిమిత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరీక్ష ఫలితాలు రావటంతో ఐచ్ఛికాల ఎంపిక, కౌన్సెలింగ్‌కు సమయం ఆసన్నమైంది. ఏఐసీటీఈ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. బ్రాంచి, కళాశాల ఎంపిక చేసుకునే విషయంలో అనుసరించాల్సిన విధానాలపై కథనం.

ఇంజినీరింగ్‌ కళాశాలలతోపాటు డీమ్డ్‌ విశ్వవిద్యాలయాల్లోనూ సీట్లను ఈఏపీసెట్‌ ర్యాంకుల ఆధారంగా ఇవ్వనున్నారు. యూనివర్సిటీల్లోని సీట్లలో 30 శాతం సీట్లు ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఇస్తారు.  విశ్వవిద్యాలయాల్లో చేరే విద్యార్థుల ఫీజులను ప్రభుత్వం రూ.70 వేలుగా నిర్ణయించింది. బియ్యం కార్డు ఉన్నవారు ఫీజు రీయింబర్సుమెంటు పథకం ద్వారా ఎటువంటి ఫీజులేకుండా విశ్వవిద్యాలయాల్లో చేరే అవకాశం గత సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చింది. వెబ్‌ ఆప్షన్ల సమయంలో విశ్వవిద్యాలయాల్లోని సీట్లను కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
బ్రాంచిల ఎంపిక కీలకం
* ఈఏపీసెట్‌, జేఈఈ (మెయిన్స్‌), ఇతర విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షలు రాసి ఇంజినీరింగ్‌, ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీల్లో మంచి కాలేజి, బ్రాంచిలో చేరాలని అనేకమంది విద్యార్థులు ఆత్రుతగా చూస్తున్నారు. దేనికి ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి?  నీ టాపర్స్‌ సీఎస్‌ఈ బ్రాంచికి ప్రాధాన్యం ఇస్తుండగా తర్వాతి స్థానాలలో ఐటీ, ఈసీఈ, ఈఈఈ ఉన్నాయి నీ కంప్యూటర్స్‌ సైన్స్‌లో ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, డేటాసైన్స్‌, రోబోటిక్స్‌, సైబర్‌సెక్యూరిటీ వంటి ఆధునిక కోర్సులు గత విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చాయి. నీ ఎవర్‌ గ్రీన్‌గా విరాజిల్లుతున్న బ్రాంచి మెకానికల్‌ నీ సివిల్‌ ఇంజినీర్లకు పెరుగుతున్న ఆదరణ నీ ఇవే కాకుండా ఏరోస్పేస్‌, అగ్రికల్చర్‌, మెరైన్‌, మైనింగ్‌, సిల్క్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ వంటి నైపుణ్యంతో కూడిన ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌లకు మంచి అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
రెండేళ్ల ప్రాంగణ ఎంపికల సరళి
ఈ విద్యా సంవత్సరంలో అమేజాన్‌, ఇన్ఫోసిస్‌, పెగా, గూగుల్‌, డెల్లాయిట్‌, టీసీఎస్‌, విప్రో, సీటీఎస్‌ వంటి ప్రఖ్యాత బహుళజాతి సంస్థలు ప్రాంగణ ఎంపికలు ప్రారంభించాయి. గతం కంటే మిన్నగా వార్షిక వేతనం రూ.44 లక్షలతో ఎంపికలు జరుపుతున్నాయి. కొన్ని రూ.30 లక్షలు, మరికొన్ని రూ.12 లక్షలతో కొలువులు ఇస్తున్నాయి. ఏటా 15 నుంచి 20 శాతం వరకు ఉద్యోగాలు సాధిస్తున్నారు.


ఆంగ్లభాషపై శిక్షణ తప్పనిసరి
ఇంజినీరింగ్‌ చదవాలకునే విద్యార్థులు తొలుత కళాశాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలి. తాము చేరబోయే కళాశాలలో ఎలాంటి ప్రాంగణ ఎంపికలు జరుగుతున్నాయో అధ్యయనం చేయాలి. కావాల్సిన నైపుణ్యాలపై, ఆంగ్లభాషపై పట్టు సాధించే విధంగా శిక్షణ కార్యక్రమం ఉందా అనేది తెలుసుకోవాలి. స్వయంగా ఆ కళాశాలలో చదువుతున్న విద్యార్థులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
-ఎన్‌.వి.సురేంద్రబాబు, సంయుక్త కార్యదర్శి (ఎన్‌టీపీవో అసోసియేషన్‌)


ఆసక్తి ఉన్నవాటినే..

తమకు ఆసక్తి ఉన్న బ్రాంచినే విద్యార్థులు ఎంచుకోవాలి. అంతేతప్ప డిమాండ్‌ ఉన్న బ్రాంచ్‌లను ఎంచుకున్నా.. వాటిపై ఆసక్తి లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి.గి కళాశాలలో మౌలిక సదుపాయాలు చూడాలి. వాటికి నాక్‌, అటానమస్‌, ఎన్‌బీఏ తదితర గుర్తింపులు ఉన్నాయో లేవో తెలుసుకోవాలి. అధ్యాపక బృందం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. వెబ్‌సైట్‌ ద్వారా కళాశాల ఉత్తీర్ణతా శాతాన్ని, ప్రాంగణ ఎంపికల శాతాలపై దృష్టి పెట్టడం మంచిది.గి ఏ బ్రాంచ్‌లో ఇంజినీరింగ్‌ చేసినా సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొలువు వస్తుంది. కాబట్టి ప్రాంగణ ఎంపికలకు కావాల్సిన నైపుణ్య శిక్షణను తొలి సంవత్సరం నుంచి ఇచ్చే కళాశాలను గుర్తించాలి. ఆ కళాశాలలో ప్రాంగణ ఎంపికల్లో ఉపాధి పొందేలా చేసుకోవాలి. పుస్తకాలకే పరిమితం అయ్యే కళాశాలలు కాకుండా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ప్రయోగాత్మకతకు ప్రాధాన్యమిచ్చే వాటి వైపు దృష్టి సారించండి.గి ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న బ్రాంచికి ఉన్న అవకాశాలు, ఇందులో ఇమిడి ఉన్న ఆధునిక సాంకేతికపై అవగాహన ఉండాలి.గి ప్రతి సబ్జెక్టుకు మరో అంశంతో సంబంధం ఉంటుంది. ఈ దృష్ట్యా అన్ని సబ్జెక్టులు చదవాలి.గి  భావ వ్యక్తీకరణతోపాటు ఆంగ్లంపై నైపుణ్యం పెంచుకోవాలి.గి ప్రాక్టికల్‌ నాలెడ్జి అందుకోవటం ఇంజినీరింగ్‌ విద్యలో కీలకం.గి ప్రస్తుత తరుణంలో ప్రాంగణ ఎంపికల్లోనే ఉద్యోగాలు వస్తున్నాయి. మొదటి సంవత్సరం నుంచే ఉద్యోగ నైపుణ్యాలు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే పోటీలో వెనుకబడే అవకాశం ఉంది.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని