logo

ధాన్యం బకాయిలు ఎప్పుడిస్తారు?

ఖరీఫ్‌ ధాన్యం విక్రయించి నాలుగు నెలలు గడిచినా నగదు రాలేదంటూ పలువురు రైతులు భీమవరంలోని జిల్లా పౌరసరఫరాల కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించి నిరసన తెలిపారు.

Published : 17 Aug 2022 06:05 IST

ముట్టడిలో పాల్గొన్న రైతులు, నాయకులు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే:  ఖరీఫ్‌ ధాన్యం విక్రయించి నాలుగు నెలలు గడిచినా నగదు రాలేదంటూ పలువురు రైతులు భీమవరంలోని జిల్లా పౌరసరఫరాల కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించి నిరసన తెలిపారు. ఏపీ కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో ఇంకా 3 వేల మందికి సొమ్ము రావాల్సి ఉందన్నారు. బకాయిలు వెంటనే విడుదలయ్యేలా చూడాలని నాయకులు యాళ్లబండి ఉమామహేశ్వరరావు, నేదూరి వెంకటేశ్వరరావు తదితరులు డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనపై అధికారులు జేసీ మురళికి సమాచారం ఇవ్వడంతో వారంలోపు బకాయిలు చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని