logo

మహిళలు స్వశక్తితో ఎదగాలి

ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు.

Published : 24 Sep 2022 05:59 IST

నమూనా చెక్కును అందిస్తున్న  కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే:  ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు స్వశక్తితో ఆర్థిక స్వావలంబన సాధించాలని కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. వైఎస్‌ఆర్‌ చేయూత కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించారు. తొలుత కుప్పంలో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని ఆన్‌లైన్లో వీక్షించారు. అనంతరం చేయూత లబ్ధిదారులకు నమూనా చెక్కును అందజేసి మాట్లాడారు. ఈ పథకం మూడో విడత కింద జిల్లాలో 81,294 మందికి రూ.152.42 కోట్లు జమైనట్లు వెల్లడించారు. డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్‌, నరసాపురం డీఎల్‌డీవో అప్పారావు, భీమవరం ఎంపీపీ విజయనర్సింహరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని