logo

ప్రకృతిలో సాగేలా!

సాగులో రసాయనాల వినియోగాన్ని తగ్గించడంతోపాటు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం గ్రామ సమాఖ్యల నుంచి వ్యవసాయ నేపథ్యం, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించే అనుభవం ఉన్న మహిళా రైతులను ఎంపిక చేస్తున్నారు.

Updated : 24 Sep 2022 06:05 IST

మహిళా రైతులకు ప్రత్యేక శిక్షణ

ఐబీ వాలంటీర్ల నియామకం

తర్ఫీదు పొందుతున్న మహిళలు

ఉంగుటూరు, న్యూస్‌టుడే: సాగులో రసాయనాల వినియోగాన్ని తగ్గించడంతోపాటు ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం గ్రామ సమాఖ్యల నుంచి వ్యవసాయ నేపథ్యం, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండించే అనుభవం ఉన్న మహిళా రైతులను ఎంపిక చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 276 మందిని ఎంపిక చేసి ఈ నెల 18 నుంచి 23 వరకు శిక్షణ ఇచ్చారు. వీరిని ‘ఐబీ- వాలంటీర్లు’గా (ఐబీ-ఐసీఆర్పీ) నియమించి నెలకు రూ.3 వేలు గౌరవ వేతనం ఇవ్వనున్నారు.

ఎంపిక ఇలా.. పని చేసే సంఘం పరిధిలో నివసిస్తూ పదో తరగతి ఉత్తీర్ణులై ఆ సంఘ లీడర్‌గా పని చేసిన అనుభవంతోపాటు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉండటం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఐబీ వాలంటీర్లను అయిదు రోజుల శిక్షణకు ఎంపిక చేస్తారు. విత్తనాలు నాటే సమయం నుంచి పంట చేతికందే వరకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఘన, ద్రవ జీవామృతాలు, కషాయాల తయారీని వివరిస్తారు.
విధులివీ..
ప్రతి ఐబీ- వాలంటీరు గ్రామ సంఘం ఆధీనంలో పని చేయాలి. ప్రతి నెలా సంఘ సమావేశంలో ప్రకృతి వ్యవసాయంపై సభ్యులకు అవగాహన కల్పించాలి. ‘పొలంబడి’ కార్యక్రమాలకు సంఘ సభ్యులు హాజరయ్యేటట్లు చూడాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించే రాయితీలను సద్వినియోగం చేసుకునేలా వీరు పర్యవేక్షించాల్సి ఉంటుంది.

ఆర్థికాభివృద్ధికి ఊతం..
జిల్లావ్యాప్తంగా ఎనిమిది కేంద్రాల్లో ఎంపిక చేసిన మహిళలకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చాం. వీరి ద్వారా సేంద్రియ సాగుపై ఆయా గ్రామాల్లోని మిగిలిన రైతులకు అవగాహన ఏర్పడుతుంది. ఈ పద్ధతిలో ఖర్చు తక్కువ కావడంతో ఆర్థికాభివృద్ధికి వీలుంటుంది. -పి.లలితా సుధ, ప్రకృతి వ్యవసాయం, డీపీఎం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని