logo

సంక్షేమ క్యాలెండర్‌ను అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ క్యాలెండర్‌ను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌దేనని

Updated : 24 Sep 2022 20:34 IST

దెందులూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ క్యాలెండర్‌ను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌దేనని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. శనివారం దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం రాట్నాలకుంటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు లబ్ధిదారులకు అందిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచే పింఛను మొత్తం పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజాపరిషత్‌ ఉపాధ్యక్షుడు పెనమాల విజయ్‌బాబు, ఎంపీపీ తాతా రమ్య, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని