logo

నకిలీ పత్రాలతో బ్యాంకు రుణం!

యజమానులకు తెలియకుండా గుర్తు తెలియని వ్యక్తులు భూమిని బ్యాంకులో కుదువపెట్టి రుణం పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేరుపాలెం నార్తుకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి చెన్నాప్రగడ శ్రీనుకు గ్రామంలో 6.20 ఎకరాల జిరాయితీ భూమి ఉంది.

Published : 26 Sep 2022 04:44 IST

సీఐడీ అధికారుల విచారణ


మొగల్తూరు, న్యూస్‌టుడే: యజమానులకు తెలియకుండా గుర్తు తెలియని వ్యక్తులు భూమిని బ్యాంకులో కుదువపెట్టి రుణం పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పేరుపాలెం నార్తుకు చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి చెన్నాప్రగడ శ్రీనుకు గ్రామంలో 6.20 ఎకరాల జిరాయితీ భూమి ఉంది. ఆ భూమిపై బ్యాంకు రుణం పొంది ఎగవేసినట్లు సీఐడీ అధికారులకు అందిన ఫిర్యాదుల మేరకు రెండు రోజుల కిందట క్షేత్రస్థాయి విచారణకు వచ్చి వెళ్లారు. దీనిపై శ్రీను స్పందిస్తూ తాను ఏ బ్యాంకు నుంచీ రుణం పొంది ఎగవేయలేదన్నారు. భూ యజమాని అయిన తనకు కనీసం సమాచారం లేకుండా అధికారులు విచారణ ఎలా చేశారని రెవెన్యూ అధికారులను రాతపూర్వకంగా ప్రశ్నించినట్లు తెలిపారు. ఇంకా వారివద్ద నుంచి తనకు ఏ విధమైన సమాచారం అందలేదన్నారు. సీఐడీ అధికారులు విచారణకు వచ్చిన విషయం వాస్తవమేనని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించారు. దీనిపై మరింత లోతుగా పరిశీలిస్తున్నామని తెలిపారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని