logo

మహాపాదయాత్రకు ఘన స్వాగతం

అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర ఆదివారం ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. పెదపాడు మండలం కొనికిలో అమరావతి ఐకాస నాయకులకు, రైతు రథానికి తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఇతర నాయకులు స్వాగతం పలికారు.

Published : 26 Sep 2022 04:44 IST

నేటి నుంచి ఏలూరు జిల్లాలో ప్రారంభం

రైతులకు స్వాగతం పలుకుతున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని

ఈనాడు డిజిటల్‌, ఏలూరు, న్యూస్‌టుడే, పెదపాడు: అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర ఆదివారం ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. పెదపాడు మండలం కొనికిలో అమరావతి ఐకాస నాయకులకు, రైతు రథానికి తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, ఇతర నాయకులు స్వాగతం పలికారు. అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి ఐకాస నాయకులతో కలిసి జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. సోమవారం నుంచి జిల్లాలో పాదయాత్ర ప్రారంభమవుతుంది.

సాగేదిలా.. సోమవారం ఉదయం 8.30 గంటలకు అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి ఐకాస నాయకులు శంఖం పూరించి జిల్లాలో పాదయాత్రను ప్రారంభిస్తారు. కొనికి నుంచి కడిమికుంట, సకలకొత్తపల్లి, సత్యవోలు, నాయుడుగూడెం, పెదపాడు, సత్యనారాయణపురం, అందేఖాన్‌ చెరువు మీదుగా ఏలూరు మండలం కొత్తూరు వరకు సాగనుంది. మధ్యాహ్నం పెదపాడులో భోజన విరామం తీసుకుంటారు. మొత్తం 15 కి.మీ. యాత్ర సాగుతుంది. రాత్రికి వట్లూరు క్రాంతి కల్యాణ మండపంలో బస చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని