logo

పగలు వ్యవసాయ పనులు... రాత్రి చోరీలు

ఉభయ గోదావరి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పాతనేరస్థులను అరెస్టు చేసి, రూ.33.56 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రవిప్రకాశ్‌ ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు.

Published : 26 Sep 2022 04:44 IST

పోలీసుల అదుపులో పాత నేరస్థులు

వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ రవిప్రకాశ్‌, డీఎస్పీ వీరాంజనేయరెడ్డి, సీఐలు, ఎస్సైలు

తణుకు, న్యూస్‌టుడే: ఉభయ గోదావరి జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు పాతనేరస్థులను అరెస్టు చేసి, రూ.33.56 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు రూ.2 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ రవిప్రకాశ్‌ ఆదివారం నిర్వహించిన సమావేశంలో వివరాలను వెల్లడించారు. 17న ఇరగవరం మండలం కంతేరుకు  చెందిన కర్రి నాగిరెడ్డి ఇంట్లో దుండగులు తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాలు, నగదు అపహరించారు. దీనిపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన నార్గన గోపాలకృష్ణ, అంగర అంజిబాబు, ఇరగవరం మండలం సూరంపూడికి చెందిన బొల్లా వీరవెంకట సత్యనారాయణలను పెనుమంచిలిలో అరెస్టు చేసి విచారించగా 16 ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. నిందితులపై 2018 నుంచి ఇప్పటివరకు పశ్చిమ గోదావరి జిల్లాలో 11, తూర్పు గోదావరి జిల్లాలో 5 కేసులు ఉన్నాయి. జైలు శిక్ష కూడా అనుభవించారు.
* నిందితులు పగలు వ్యవసాయ పనులు చేసుకుంటూ రెక్కీ నిర్వహించి, రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రివేళ దొంగతనాలు చేస్తుంటారు. ఇళ్లకు తాళం వేసి, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు విధిగా పోలీసులకు, సచివాలయ మహిళా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.  

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts