logo

అమరావతికి జన హారతి

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అరసవల్లి వరకు చేపట్టిన రైతుల మహా పాదయాత్రకు సోమవారం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. అన్ని వర్గాలు జైకొట్టి సంపూర్ణ మద్దతు తెలిపాయి. పెదపాడు మండలం కొనికిలో మొదలైన

Published : 27 Sep 2022 06:15 IST

నినాదాలతో రైతులకు స్వాగతం

యాత్రకు అన్ని వర్గాల మద్దతు

పెదపాడు పాదయాత్రలో జనసందోహం

ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్‌టుడే-దెందులూరు, పెదపాడు: రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అరసవల్లి వరకు చేపట్టిన రైతుల మహా పాదయాత్రకు సోమవారం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. అన్ని వర్గాలు జైకొట్టి సంపూర్ణ మద్దతు తెలిపాయి. పెదపాడు మండలం కొనికిలో మొదలైన ఈ యాత్ర కొత్తూరు వరకు సాగింది. రథంపై కొలువైన వెంకటేశ్వరస్వామికి నాయకులు, రైతులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం..శంఖం పూరించడంతో పాదయాత్ర మొదలైంది. తెదేపా నాయకులు యాత్ర ప్రారంభ సమయంలో తీన్మార్‌ వాయించి రైతుల్లో ఉత్సాహం నింపారు. కడిమికుంట, సకలకొత్తపల్లి, సత్యవోలు, నాయుడుగూడెం, పెదపాడు గ్రామాల్లో మహిళలు అధిక సంఖ్యలో యాత్రకు స్వాగతం పలికారు. రహదారి మొత్తం పూలు చల్లి రైతులను నడిపించారు. ప్రధాన రహదారికి దూరంగా ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా చేరుకుని యాత్ర వచ్చే వరకూ నిరీక్షించి   మద్దతు పలికారు. మార్గం మధ్యలో రైతులకు ఇబ్బంది కలగకుండా మజ్జిగ, పండ్లు, తాగునీరు, శీతలపానీయాలు, బిస్కెట్లు, ఓఆర్‌ఎస్‌ పొట్లాలు...ఇలా ఎవరికి తోచినట్లు వారు అందజేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే విధంగా మహిళా రైతులు నినాదాలు చేశారు. యువకులు, మధ్య వయసువారితోపాటు వృద్ధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారితో కలిసి నినాదాలు చేస్తూ భాగస్వాములయ్యారు. రైతు రథం ముందు నీరు పోస్తూ రైతులకు హారతులిచ్చారు. రాజకీయాలకు అతీతంగా న్యాయవాదులు, వైద్య విద్యార్థులు, దళిత బహుజనులతోపాటు తెదేపా, భాజపా, జనసేన, వామపక్షాల నాయకులు రైతులకు మద్దతు తెలిపారు. మంగళవారం యాత్రకు విరామం ఇచ్చారు. బుధవారం తిరిగి ప్రారంభం అవుతుంది. రైతులకు వట్లూరులోని ఓ కల్యాణ మండపంలో విడిది ఏర్పాట్లు చేశారు. 

కొనికిలో రథం వద్ద పూజలు

పెదపాడులో రథానికి నీరు పోస్తూ..

యాత్రకు న్యాయవాదుల సంఘీభావం

రైతులపై పూలవర్షం 

పెదపాడులో హారతులిస్తున్న మహిళలు, రైతులు

సత్యవోలులో రైతులకు పువ్వులు అందజేసి స్వాగతం

పలుకుతున్న భాజపా నాయకులు

కొనికిలో డప్పు వాయిస్తున్న తెదేపా నాయకులు జవహర్,

వీరాంజనేయులు, రామానాయుడు, చంటి తదితరులు

మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు చిత్రపటంతో..

ద్విచక్ర వాహనంపై వస్తూ  ఉత్సాహం నింపుతున్న మహిళ 

యాత్రలో దివ్యాంగుడు 

యాత్రను చూసేందుకు వచ్చిన వృద్ధురాలు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని