logo

సమాజ పరిరక్షణకు కళలు దోహదం

సమాజ పరిరక్షణకు కళలు, సంస్కృతీసంప్రదాయాలు దోహదపడతాయని రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. కేవీఎస్‌ ట్రస్టు, హిందూ యువజన సంఘం సంయుక్తంగా ఇక్కడి వైఎంహెచ్‌ హాల్లో సోమవారం

Published : 27 Sep 2022 06:15 IST

కళాకారులతో లక్ష్మీప్రసాద్, బుద్ధ ప్రసాద్, సాబ్జీ తదితరులు

ఏలూరు గ్రామీణ, న్యూస్‌టుడే: సమాజ పరిరక్షణకు కళలు, సంస్కృతీసంప్రదాయాలు దోహదపడతాయని రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అన్నారు. కేవీఎస్‌ ట్రస్టు, హిందూ యువజన సంఘం సంయుక్తంగా ఇక్కడి వైఎంహెచ్‌ హాల్లో సోమవారం నిర్వహించిన కె.వి.సత్యనారాయణ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ప్రొఫెసర్‌ భాగవతుల సేతురామ్, మద్దాలి ఉషాగాయత్రి, నాట్యాచారిణి ఎ.పార్వతీరామచంద్రన్, కళాకారుడు రఘుపాత్రుని శ్రీకాంత్‌లను పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన చిన్నారుల కూచిపూడి, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. శాసనసభ మాజీ స్పీకర్‌ మండలి బుద్ధ ప్రసాద్, ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జి, వైయంహెచ్‌ఏ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వరరావు, కార్యదర్శి మజ్జి కాంతారావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని