logo

వైద్యాధికారులమంటూ చలామణి

అర్హత లేకపోయినా వైద్యాధికారులమంటూ చలామణి అవుతున్న ఇద్దరు సీహెచ్‌వోలకు ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో సరైన వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Published : 27 Sep 2022 06:15 IST

ఇద్దరు సీహెచ్‌వోలకు షోకాజ్‌ నోటీసులు

వైద్యాధికారిణి హోదాలో కరపత్రాన్ని ముద్రించిన ఓ సీహెచ్‌వో

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: అర్హత లేకపోయినా వైద్యాధికారులమంటూ చలామణి అవుతున్న ఇద్దరు సీహెచ్‌వోలకు ఉన్నతాధికారులు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో సరైన వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే... ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో పీహెచ్‌సీ పరిధిలో వెల్‌నెస్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇవి పీహెచ్‌సీల పరిధిలో పనిచేస్తాయి. వీటిలో సేవలందించేందుకు బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన వారికి శిక్షణ అందించి కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్స్‌ (సీహెచ్‌వో)గా నియమించారు. పలుచోట్ల వెల్‌నెస్‌ సెంటర్లలో అందిస్తున్న సేవలకు సంబంధించిన కరపత్రాల్లో సీహెచ్‌వోలను వైద్యాధికారులుగా ముద్రించారు. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవటంతో వైద్య ఆరోగ్య శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ పద్మశశిధర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో రవిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో గుండుగొలను పీహెచ్‌సీ పరిధిలోని సీహెచ్‌వో వై.నాగదుర్గ, గోపన్నపాలెం పీహెచ్‌సీ పరిధిలోని సీహెచ్‌వో కె.వినయ్‌కు సోమవారం షోకాజు నోటీసులు జారీ చేశారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts