logo

జగజ్జననికి జేజేలు

భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4.30 గంటలకు ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ మానేపల్లి నాగేశ్వరరావు దంపతులు కలశస్థాపన చేశారు.

Published : 27 Sep 2022 06:15 IST

భీమవరం : స్వర్ణ కవచ అలంకరణలో మావుళ్లమ్మ

భీమవరం ఆధ్యాత్మికం,తాడేపల్లిగూడెం, పెనుగొండ, న్యూస్‌టుడే: భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4.30 గంటలకు ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ మానేపల్లి నాగేశ్వరరావు దంపతులు కలశస్థాపన చేశారు. తొలిరోజు అమ్మవారు స్వర్ణ కవచ అలంకరణలో దర్శనమిచ్చారు. లక్ష కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మకి ప్రత్యేక పూజలు చేసి, 145 కిలోల వెండితో చేసిన ఆభరణాలు అలంకరించారు.

పెనుగొండ : శ్రీబాల అలంకరణలో మహిషాసురమర్దని

తాడేపల్లిగూడెం : బలుసులమ్మకు 145 కిలోల వెండి ఆభరణాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని