logo

కేసు రాజీ చేసుకోవాలని బెదిరించిన వారికి జరిమానా

కేసు రాజీ చేసుకోవాలని బెదిరించిన ముగ్గురు నిందితులకు రూ.రెండు వేల చొప్పున జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ తెలిపిన వివరాల ప్రకారం

Published : 27 Sep 2022 06:15 IST

నూజివీడు, న్యూస్‌టుడే: కేసు రాజీ చేసుకోవాలని బెదిరించిన ముగ్గురు నిందితులకు రూ.రెండు వేల చొప్పున జరిమానా విధిస్తూ నూజివీడు స్పెషల్‌ మేజిస్ట్రేట్‌ సోమవారం తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ తెలిపిన వివరాల ప్రకారం నూజివీడు మండలం దేవరగుంట గ్రామానికి చెందిన కొలుసు చిట్టిరాజు తన మైనర్‌ కుమార్తెపై అఘాయిత్యం చేశాడంటూ ఆమె తల్లి 18 సెప్టెంబరు 2018న ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ కేసును రాజీ చేసుకోవాలంటూ అదే గ్రామానికి చెందిన మన్నె రాజు, కిషోర్‌, రాజకిషోర్‌, పలనాటి రాజశేఖర్‌, అద్దెపల్లి నాగేశ్వరరావు అనే వ్యక్తులు అదే సంవత్సరం సెప్టెంబరు 21న అర్ధరాత్రి ఫిర్యాది ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి బెదిరించారు. దీనిపై బాధితురాలి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితులకు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని