logo

పశువుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి

పశువుల ఆరోగ్య సంరక్షణపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి, అనేక పథకాలు ప్రవేశపెట్టారని శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేనురాజు అన్నారు. తణుకు జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం కొనసాగిన ఒంగోలు జాతి వృషభ రాజా బల ప్రదర్శన పోటీల సందర్భంగా ఆయన మాట్లాడారు.

Published : 02 Oct 2022 03:00 IST

తణుకులో కొనసాగుతున్న ఎడ్ల పందేలు

మోసేనురాజుకు జ్ఞాపిక అందిస్తున్న మంత్రి కారుమూరి

తణుకు, న్యూస్‌టుడే: పశువుల ఆరోగ్య సంరక్షణపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి, అనేక పథకాలు ప్రవేశపెట్టారని శాసన మండలి ఛైర్మన్‌ కొయ్యే మోసేనురాజు అన్నారు. తణుకు జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం కొనసాగిన ఒంగోలు జాతి వృషభ రాజా బల ప్రదర్శన పోటీల సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇలాంటి పోటీల ద్వారా అంతరించిపోతున్న గ్రామీణ కళలను కాపాడుకోవచ్చన్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చే ఇటువంటి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు మాట్లాడుతూ రోజుకు 11 జతల ఎడ్లపోటీలు నిర్వహించి రూ.25 లక్షల వరకు నగదు బహుమతులు అందజేస్తున్నామని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న రైతులకు రైస్‌ కుక్కర్లు అందించారు. అనంతరం శాసనమండలి ఛైర్మన్‌ మోసేనురాజు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజుకు జ్ఞాపిక అందించారు. వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.

బండను లాగుతున్న ఎద్దులు​​​​​​​

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని