logo

పాలకొల్లులో భారీ చోరీ

పాలకొల్లులో భారీ చోరీ జరిగింది. 30 కాసుల బంగారం, రూ.10 లక్షల నగదు దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాలకొల్లు ఆంధ్రాబ్యాంక్‌ వెనుక వీధిలో ఉన్న భవనం పైఅంతస్తులో సింహాద్రి నాగేశ్వరరావు, సత్యభామామణి దంపతులు నివాసం ఉంటున్నారు.

Published : 02 Oct 2022 03:00 IST

రూ.10 లక్షల నగదు, 30 కాసుల బంగారం అపహరణ

ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ రవిప్రకాశ్‌

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: పాలకొల్లులో భారీ చోరీ జరిగింది. 30 కాసుల బంగారం, రూ.10 లక్షల నగదు దొంగలు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పాలకొల్లు ఆంధ్రాబ్యాంక్‌ వెనుక వీధిలో ఉన్న భవనం పైఅంతస్తులో సింహాద్రి నాగేశ్వరరావు, సత్యభామామణి దంపతులు నివాసం ఉంటున్నారు. ఇంటికి తాళం వేసి సెప్టెంబరు 27న తిరుపతి వెళ్లారు. 30న ఉదయం ఇంట్లో నుంచి పొగ వస్తుందని స్థానికులు వారికి ఫోన్‌లో సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు. అప్పటికే రెండు గదుల్లో ఉన్న పరుపులు, కొన్ని దుస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. బీరువా తలుపులు తీసి ఉండటాన్ని గుర్తించి బాధితులకు తెలియజేశారు. నాగేశ్వరరావు దంపతులు హుటాహుటిన తిరుపతి నుంచి బయలుదేరి శనివారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. బీరువాలో నగదు, బంగారం కనిపించడం లేదని బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఘటన స్థలాన్ని ఎస్పీ రవిప్రకాశ్‌, డీఎస్పీ రామాంజనేయులు పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని