logo

మహాలక్ష్మిగా జగజ్జనని

దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ శనివారం మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళా వేదికపై సాయంత్రం వింజరపు రామకృష్ణ శిష్యబృందం సంగీత విభావరి జరిగింది.

Updated : 02 Oct 2022 06:28 IST

భీమవరంలో మావుళ్లమ్మ

భీమవరం ఆధ్యాత్మికం, పాలకొల్లు పట్టణం, పెనుమంట్ర, న్యూస్‌టుడే: దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ శనివారం మహాలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ కళా వేదికపై సాయంత్రం వింజరపు రామకృష్ణ శిష్యబృందం సంగీత విభావరి జరిగింది. అమ్మవారి అలంకరణల విశిష్టతపై వేద పండితుడు ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇచ్చారు. పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారిని శ్రీమహాలక్ష్మీదేవిగా అలంకరించారు. క్షీరారామలింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు, సహస్ర నామార్చనలు చేశారు. నెగ్గిపూడిలో శ్రీ వనువులమ్మ, కనకదుర్గమ్మలు మహాలక్ష్మి అలంకరణల్లో భక్తులకు దర్శనమిచ్చారు. యువతులు అష్టలక్ష్మి రూపాలను ధరించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పెనుమంట్రలో బోనాల ఉత్సవం నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు ఎత్తుకుని పాల్గొన్నారు.

పాలకొల్లులో..

నెగ్గిపూడిలో అష్టలక్ష్మి రూపాల్లో యువతులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని