logo

రూ.100 ఇస్తే మరునాడే.. లేకుంటే పక్షం రోజులు

ఆయిల్‌పామ్‌ గెలల ధరల చెల్లింపుల్లో కంపెనీలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలతో రైతులు అవస్థలు పడుతున్నారు. సకాలంలో గెలల విక్రయం పైకం చేతికి అందడం లేదని వాపోతున్నారు. జంగారెడ్డిగూడెంలోని నవ భారత్‌ పరిశ్రమ వారు రూ.100 చెల్లించి అంగీకార పత్రం ఇస్తే గెలలు అమ్మిన మరునాడే సొమ్ములు జమ చేస్తోంది.

Published : 02 Oct 2022 03:00 IST

ఆయిల్‌పామ్‌ గెలల ధర చెల్లింపుల్లో కంపెనీల ద్వంద్వ విధానం

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: ఆయిల్‌పామ్‌ గెలల ధరల చెల్లింపుల్లో కంపెనీలు అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలతో రైతులు అవస్థలు పడుతున్నారు. సకాలంలో గెలల విక్రయం పైకం చేతికి అందడం లేదని వాపోతున్నారు. జంగారెడ్డిగూడెంలోని నవ భారత్‌ పరిశ్రమ వారు రూ.100 చెల్లించి అంగీకార పత్రం ఇస్తే గెలలు అమ్మిన మరునాడే సొమ్ములు జమ చేస్తోంది. చెల్లించని వారికి పక్షం రోజులకు ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆ సమయానికి కూడా నగదు అందడం లేదని పలువురు కర్షకులు ఆరోపిస్తున్నారు. తాను సెప్టెంబరు 13న గెలలు వేస్తే ఇంత వరకు డబ్బులు రాలేదని కామయ్యపాలెం గ్రామానికి చెందిన జగదీష్‌ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి చాలా మంది ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటికే రైతులు వారు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందనలో ఫిర్యాదు చేశారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts