logo

బెదిరించి ఖాళీ పత్రాలపై సంతకాలు

చంపుతానని బెదిరించి ఖాళీపత్రాలపై సంతకాలు చేయించుకున్నారంటూ విశాఖ పరిధి అగనంపూడికి చెందిన తేటకలి మురళీకృష్ణ ఆకివీడు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఎస్సై కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం..

Published : 02 Oct 2022 03:00 IST

ఆకివీడు, న్యూస్‌టుడే: చంపుతానని బెదిరించి ఖాళీపత్రాలపై సంతకాలు చేయించుకున్నారంటూ విశాఖ పరిధి అగనంపూడికి చెందిన తేటకలి మురళీకృష్ణ ఆకివీడు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. ఎస్సై కిరణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. మురళీకృష్ణ గతంలో ఆకివీడు మండలం దుంపగడప గ్రామానికి చెందిన రామకృష్ణకు ఉద్యోగం ఇప్పిస్తానని విజయవాడకు చెందిన వెంకట్‌, ఉపేంద్రలను పరిచయం చేశారు. తరువాత ఉద్యోగం విషయంలో రామకృష్ణ రూ.12 లక్షల నగదును ఉపేంద్ర బ్యాంకు ఖాతాలో జమచేశారు. ఈ విషయమై మాట్లాడేందుకు సెప్టెంబరు 27న మురళీకృష్ణ ఆకివీడు వచ్చారు. రామకృష్ణ అతడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని బంధువుల ఇంటికి తీసుకెళ్లి చరవాణి లాక్కొని, చంపేస్తానని బెదిరించి ఖాళీ స్టాంపు పత్రాలపై సంతకం పెట్టించుకున్నారు. ఈ మేరకు మురళీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts