logo

ప్రభుత్వ ఆసుపత్రి నిధులు దుర్వినియోగం

గత రెండేళ్లలో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.2 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన శనివారం నిర్వహించారు.

Published : 02 Oct 2022 03:00 IST

పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు

పాలకొల్లు పట్టణం, న్యూస్‌టుడే: గత రెండేళ్లలో పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.2 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సి.గీతాకుమారి చేసిన అవినీతిపై విచారణ వేగవంతం చేసి నగదు రికవరీ చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి, వైద్యవిధాన పరిషత్తు కమిషనర్‌ వినోద్‌కుమార్‌, డీసీహెచ్‌ఎస్‌ ఏవీఎన్‌ మోహన్‌లకు ఫిర్యాదు చేశామన్నారు. ముఖ్యంగా ఆసుపత్రిలో గర్భకోశ నిపుణులు లేకపోవడం, వైద్యపరికరాలు, అభివృద్ధి పనులు తదితర సమస్యలు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు.

Read latest West godavari News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts